గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. నవరాత్రుల అనంతరం గణనాధులను నిమజ్జనానికి తరలించే క్రమంలో భూపాలపల్లి పట్టణంలోని స్థానిక అంబేడ్కర్ సెంటర్ లో ఈరోజు శుక్రవారం రాత్రి ధర్మవాహిని గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నవరాత్రులు పూజలందుకొని వివిధ ప్రాంతాల నుండి వస్తున్న గణనాధుల నిమజ్జన శోభాయాత్రకు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవ కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే మెమొంటో లను అందించి, శాలువాలు కప్పి