నంద్యాలలో ఎవరైనా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ శేషన్న వ్యాపారస్తులను హెచ్చరించారు. గురువారం ఆయన చాంబర్లో ప్లాస్టిక్ కవర్లు అమ్మే వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను పట్టణంలో నిషేధించినట్లు ఆయన తెలిపారు