కడప జిల్లా బద్వేల్ పట్టణంలో శనివారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర - స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆర్డిఓ చంద్రమోహన్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కోటవీధిలోని జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్ నుండి ప్రారంభమై నాలుగు రోడ్ల కూడలి వరకు సాగింది. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఇళ్ళు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మరియు నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్, రెవిన్యూ, పోలీస్, ఆర్ అండ్ బి, మెడికల్ &హెల్త్, ఇరిగేషన్, ఐసిడిఎస్,ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.