పెంచికల్పేట్ మండల కేంద్రంలోని కబ్రిస్తాను సమీపంలో మంగళవారం ఉదయం చుక్కల దుప్పిపై కుక్కలు దాడి చేశాయని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎఫ్ఆర్ఓ అనిల్ కుమార్ తన సిబ్బందితో కలిసి దుప్పికి చికిత్స అందిస్తుండగానే మృతి చెందినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. మృతిచెందిన చుక్కల దుప్పికి అటవీశాఖ కార్యాలయంలో దహన సంస్కారాలు ఏర్పాటు చేసినట్లు ఎఫ్ఆర్ఓ తెలిపారు,