మహిళలు విభిన్న రంగాల్లో స్వయం ఉపాధి పొందేలా శిక్షణలు అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సారంగాపూర్ మండలం చించోలి సమీపంలోని మహిళా ప్రాంగణంలో జరుగుతున్న శిక్షణా కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.