వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రౌడీ మూకలు బరితెగించి ప్రవర్తిస్తున్నారని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడుసార్లు గెలిచిన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై హత్యాయత్నానికి కుట్ర చేయడం సామాన్య ప్రజలను సైతం భయభ్రాంతులకు గురిచేస్తుందన్నారు. కోటంరెడ్డి హత్యకు కుట్ర చేసింది ఎవరు..? దాని వెనుక ఎవరున్నారనే విషయాన్ని పోలీసులు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. రౌడీలా అరాచకాలు దారుణాలు చూస్తుంటే భయమేస్తుందన్నారు. చిల్లర రౌడీలు ప్రజలను భయపెడుతున్నారని శనివారం సాయంత్రం 5:00 తెలిపారు