భూపాలపల్లి నియోజకవర్గంలోని మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టినట్లు మాజీ ఎమ్మెల్యే గండ్ర తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిబిఐ కేసును పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే సిబిఐ కేసును ఎత్తిచేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.ఇదే నేపథ్యంలో రైతులకు యూరియా అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పందించి రైతులకు సరిపడా యూరియా అందివాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు మాజీ ఎమ్మెల్యే.