గ్రూప్-1 రద్దుకు నైతిక బాధ్యత వహిస్తూ TSPSC ఛైర్మన్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీహరి, కో ఆర్డినేటర్ రాజేందర్ నాయక్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ పిలుపు మేరకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆదేశానుసారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద బీఆర్ఎస్వీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు