దెందులూరు మండలం సోమవరప్పాడు వద్ద పెదవేగి సీఐ సిహెచ్. రాజశేఖర్ తమ సిబ్బందితో కలిసి బుధవారం సాయంత్రం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించిన విషయాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్ట్ తప్పనిసరిగా వేసుకోవాలని, వాహనదారులు ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించడం ద్వారా రోడ్డుప్రమాదాలను నిరోదించవచ్చని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా సరైన ధ్రువపత్రాలు లేని వాహనదాలకు సీఐ జరిమానా విధించారు.