సూర్యాపేట జిల్లా: వీరవనిత చాకలి ఐలమ్మ ఈటా సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎస్ఐ ఈట సైదులు శుక్రవారం అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం జాజిరెడ్డిగూడెంలోని చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా విగ్రహానికి రజక సంఘం నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు.