మొక్కజొన్న బస్తాల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్, అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన, మహబూబాబాద్ జిల్లా బయ్యారం శివారులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు, బయ్యారం నుండి ఇల్లందు వైపు, మొక్కజొన్న బస్తాల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ,బయ్యారం శివారు పెట్రోల్ బంకు సమీపం వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడగా వస్తాను రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. డ్రైవర్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.