మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని గోదావరి నది పుష్కరఘాట్ ను శనివారం ఉదయం సందర్శించరు రాష్ట్ర కార్మిక,గనులశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీపక్ జులై 2027 నుంచి నిర్వహించబోయే గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటి నుంచే చేపట్టేందుకు ఆఫీసర్లతో మంత్రి చర్చించారు. భక్తులకు అవసరమయ్యే పార్కింగ్ స్థలాలు, దుకాణాల స్టాళ్లు, తాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించేందుకు అవసరమైన ప్రణాళికను తక్షణమే సమర్పించాలని అధికారులకు సూచించరు.ఈసారి పుష్కరాలకు సుమారు పది లక్షల మంది వస్తారని అంచనాతో పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి వివేక్ వెంకటస్వామి