ఒకవైపు పర్యాటకానికి, మరోవైపు వ్యాపారానికి కేంద్రంగా వెలుగొందుతున్న విశాఖపట్నంలో ఆహార కల్తీ సమస్య రోజురోజుకు పెరిగిపోతోంది. నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, చివరకు రోడ్డు పక్కన బండ్లలో కూడా నాణ్యత లేని, కల్తీ ఆహారం విక్రయిస్తున్నారని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.నగరంలో దాదాపు అన్ని రకాల ఆహార పదార్థాలు కల్తీకి గురవుతున్నాయి. వంట నూనెలను పదేపదే వేడి చేసి ఉపయోగించడం, కల్తీ నూనెలు అమ్మడం వంటివి నిత్యం జరుగుతున్నాయి.