శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని పీవీఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అధ్యక్షతన ఎన్డీఏ కూటమి విస్తృత స్థాయి సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈనెల 10వ తేదీన అనంతపురం జిల్లా కేంద్రంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభను నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. జయప్రదం చేయాలని, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని తెలియజేశారు.