ప్రకాశం జిల్లా మార్కాపురం మార్కెట్ ప్రాంతం వినాయక చవితి పండుగ సందర్భంగా స్థానికులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుండే పూజకు సంబంధించిన సామాగ్రిని తీసుకునేందుకు స్థానికులు రావడంతో మార్కెట్ బజార్ సందడి వాతావరణం నెలకొన్నది. వినాయక స్వామికి ప్రీతికరమైన పత్రి వెలగ కాయ తామర పువ్వు తామరాకు అరటి పిలకలు పూలు ఆకులు పండ్లు తదితర పూజా సామాగ్రిని కొనుగోలు చేశారు.