గ్రామపంచాయతీ మల్టీపర్పస్ విధానాన్ని రద్దుచేసి జి.ఓ.60 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రెబ్బెన మండల కేంద్రంలో గురువారం గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్-ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కార్మికులు వేతన బకాయిలు, బీమా సదుపాయాలు, పిఎఫ్, ఇయస్ఐ, యూనిఫాంలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.