పేద ప్రజలకు న్యాయం చేయవలసిన అధికారులు బెదిరింపులకు దిగితే తాము ఎవరికి చెప్పుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు.ఇటీవల పలు పంట పొలాల్లో నుండి కాలవ మంజూరు కాగా జ ప్రారంభం చేయాల్సిన మొదటి నుండి కాకుండా మధ్యలో ఉన్న పొలంలో కాలువ తీయడాన్ని వ్యతిరేకిస్తున్నామని రైతులు తెలిపారు. నేపథ్యంలో కుటుంబ సభ్యులను రెవిన్యూ అధికారులు బెదిరిస్తున్నారని అంటూ విమర్శలు చేశారు. దీనిపై ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని భాదితులు కోరారు