Parvathipuram, Parvathipuram Manyam | Feb 28, 2025
జిల్లా అభివృద్ధికి రూ.10వేల కోట్లు కేటాయించాలని సిపిఎం గొర్లి వెంకటరమణ, బి వి రమణ, పి రాజశేఖర్,నాయకులు పి సన్యాసిరావు, బి సూరిబాబు, ఎస్ ఉమామహేశ్వరరావు కోరారు. శుక్రవారం పార్వతీపురం సుందరయ్య భవనం లో రాష్ట్ర బడ్జెట్ పై ప్రచార కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో మన్యం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టు లైన జంఝావతి, తోటపల్లి, గుమ్మడి గేడ్డ, వట్టిగేడ్డ ప్రాజెక్టుల పూర్తికి ఎలాంటి కేటాయింపులు లేవని విమర్శించారు. జిల్లాలో గిరిజన ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి, జిల్లా లో రహదారులు మరమ్మతులకు కూడా నిధులు పూర్తి స్తాయి లో కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు.