పెందుర్తి సమీపంలోని దొగ్గవానిపాలెంలో గల రాయల్ అపార్టుమెంటులోని ఓ ఫ్లాట్‌లో సోమవారం రాత్రి ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఫ్లాట్ యజమాని తల్లి రాత్రి 10గంటల సమయంలో స్నానం చేస్తుండగా,ముందుగా వంటగదిలో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఫ్లాట్ యజమాని సతీశ్, ఆయన భార్య,ఆరేళ్ల కుమారుడు సెల్లార్‌లో ఉన్నారు. ఫ్లాట్‌లో మంటలు వ్యాపించాయంటూ సతీశ్‌కు తల్లి వీడియో కాల్ ద్వారా సమాచారం అందించింది. దీంతో ఆయన వెంటనే ఫ్లాట్‌కు చేరుకుని ఆమెను సురక్షితంగా బయటకు తెచ్చాడు. రూ.18 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు.