పత్తికొండ మండలం జూటూరు సమీపంలో నల్లవంక వాగుకురిసిన వర్షాలకు ఉదృతంగా ప్రవహిస్తూ వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం శుక్రవారం ఏర్పడింది. బెంగుళూరు నుంచి మంత్రాలయం వెళ్లే భక్తుల వాహనాలు ఈ మార్గం ద్వారా వెళ్తాయి. దీంతో భక్తులు ఈ మార్గం ద్వారా ప్రయాణించడానికి ఇబ్బందికరంగా మారింది. నీటి ప్రవాహం తగ్గేంతవరకు వారు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.