బ్రహ్మసముద్రం మండలం పరిధిలోని పలు గ్రామాల్లో జూదాలు విచ్చల విడిగా జరుగుతున్నాయి. పేకాట, మట్కా, జూదం భారీగా జరుగుతున్నాయి. కొత్తగా రాణి, పూలు జూదం ఆడుతున్నారు.ఇంత విచ్చలవిడిగా జూదాలు జరుగుతున్నా పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. జూదాలతో పాటు మద్యం కూడా ఎక్కడపడితే అక్కడ తాగుతున్నారు. రాత్రివేళ మహిళలు బయటకు రావాలంటే భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి జూదాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.