మారుతున్న కాలాలకు అను గుణంగా ప్రస్తుత సీజన్లో విజృంభిస్తున్న డెంగ్యూ, మలేరియా విష జ్వరాలపై అవగాహనకు భద్రం ఫౌండేషన్ కళాకారులు చేస్తున్న వినూత్న వీధి నాటీక ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు భద్రం ఫౌండేషన్ కళాకారులు గత కొన్ని రోజుల నుంచి జీవీఎంసీ పరిధిలోని పలు వార్డులలో ఈ ప్రదర్శనలు చేస్తున్నారు ఇందులో భాగంగా సోమవారం ఎన్ఏడి కొత్త రోడ్డు,మర్రిపాలెం రైతు బజార్,జాకీర్ హుస్సేన్ నగర్ లలో ఈ నాటిక ప్రదర్శించారు ముఖ్యంగా దోమల వల్ల ఈ విషజ్వరాలు వ్యాపిస్తున్న నేపథ్యంలో దోమలు అరికట్ట ఎందుకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.