రాయదుర్గం పట్టణంతోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. శుక్రవారం సాయంత్రం నుంచి పట్టణంలోని నాన్ చెరువులో సిఐ జయానాయక్ దగ్గర ఉండి నిమజ్జన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అలాగే బొమ్మనహల్ లో ఎస్ఐ నబిరసూల్, కణేకల్లులో ఎస్ఐ నాగమధు, గుమ్మగట్ట మండలంలో ఈశ్వరయ్య ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది నిమజ్జన ఊరేగింపులు మెదలు నిమజ్జనం పూర్తి అయ్యేవరకూ నిర్వాహకులకు పలు సూచనలు చేస్తూ ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టారు.