లావేరు మండలం మురపాకను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని మండల సాధన సమితి డిమాండ్ చేసింది. సోమవారం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్కు మండల సాధన సమితి సభ్యులు వినతిపత్రం అందజేశారు. మురపాకను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వారు జాయింట్ కలెక్టర్కు వివరించారు. ఈ విషయంపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని జేసీ హామీ ఇచ్చారు.