టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి శుక్రవారం గాంధీభవన్ లో మాట్లాడుతూ, కేసీఆర్ కుటుంబం ఇప్పటికీ రాజకీయాల్లో ఉండటానికి కాంగ్రెస్ కారణమని అన్నారు. కేటీఆర్ కాంగ్రెస్ ను థర్డ్ క్లాస్ పార్టీ అనడం సరికాదని, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తర్వాత కేసీఆర్ సోనియా గాంధీ కుటుంబాన్ని కలవలేదా అని ప్రశ్నించారు. అప్పుడు కాంగ్రెస్ థర్డ్ క్లాస్ పార్టీగా గుర్తుకు రాలేదని ఆయన పేర్కొన్నారు.