బీపీ, షుగర్ తగ్గేందుకు గన్నేరు ఆకులు ఉడికించి తాగాలని ఓవ్యక్తి ఇచ్చిన సలహాతో వృద్దురాలు గన్నేరు ఆకు ఉడకబెట్టి తాగేసి తీవ్ర అస్వస్థతకు గురైంది. గురువారం సాయంత్రం రామసముద్రంలో జరిగిన ఘటనపై బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. రామసముద్రానికి చెందిన మునిలక్ష్మమ్మ(70) కొంతకాలంగా బిపితో బాధపడుతోంది. స్థానికంగా ఉన్న ఓవ్యక్తి ఆమెకు గన్నేరు ఆకులు ఉడికించి తాగాలని చెప్పాడని, తాగి అస్వస్థతకు గురైంది.