ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని యాడికి మెడికల్ ఆఫీసర్ సుమంత్ రెడ్డి, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసులు అన్నారు.యాడికి లో శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆరోగ్య సిబ్బందితో కలిసి ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే చేశారు.ఇళ్ళ ముందు ఉన్న నీటి తొట్టెలను శుభ్రం చేశారు.అందరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు, ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.