తమ గ్రామం పక్కనే ఉన్న ఎలుగులమెట్టపై క్వారీ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని పార్వతీపురం మండలం హెచ్. కారాడవలస గ్రామస్తులు కోరారు. శనివారం పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ చంద్రను గ్రామస్తులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. క్వారీ ఏర్పాటు జరిగితే భవిష్యత్తులో జరగబోయే నష్టాన్ని, ఇబ్బందులను ఎమ్మెల్యేకు వివరించారు. క్వారీ తవ్వకాల వల్ల పంట భూములు, సమీప చెరువులు కలుషితమవుతాయని అన్నారు. పెద్దపెద్ద శబ్దాల వల్ల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని అన్నారు. వెంటనే క్వారీ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు నిలుపుదల చేయించాలని కోరారు.