నిర్మల్ పట్టణంలో కొలువుదీరిన గణనాథుల నిమజ్జన శోభాయాత్ర ఆదివారం కొనసాగుతోంది. యువకుల నృత్యాలు, భజనలతో పట్టణం కోలాహలంగా మారింది. శనివారం ప్రారంభమైన ఈ శోభాయాత్ర ఆదివారం సాయంత్రం నాటికి పూర్తవుతుందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ యాత్రను తిలకించడానికి పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు భారీగా తరలివస్తున్నారు.