జనసేన పార్టీకి కులం, మతం పట్ల సరైన సిద్ధాంతాలు లేవని మచిలీపట్నం మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఆదివారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గతంలో కులాలు, మతాలపై మాట్లాడిన వీడియోలను ప్రదర్శించారు. పవన్ కళ్యాణ్ ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడటం వల్ల ఆయన సిద్ధాంతాలు అర్థం కాక ఆ పార్టీ నాయకులే సతమతమవుతున్నారని అన్నారు.