కుప్పంలో రోడ్డు విస్తరణ పనులకు ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ సోమవారం భూమి పూజ చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కుప్పం అభివృద్ధిలో భాగంగా రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించామని అన్నారు. కృష్ణగిరి సర్కిల్ నుంచి కడ కార్యాలయం వరకు, అక్కడి నుంచి టీడీపీ కార్యాలయం ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ వరకు విస్తరణ పనులు చేపడుతున్నామని తెలిపారు. విస్తరణలో భవనాలు కోల్పోయే వారికి న్యాయం చేస్తామని పేర్కొన్నారు.