బోనకల్ మండలం కలకోట-రాయన్నపేట గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కలకోట వద్ద ఉన్న రాళ్లవాగుపై వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో కలకోట-రాయన్నపేట గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ పొదిలి వెంకన్న సూచించారు.