బెల్లూరి అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈనెల 5న శుక్రవారం ఓనం మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఓనం మహోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని కలెక్టర్ రాజర్షిషా, ఎమ్మెల్యే పాయల్ శంకర్లకు గురువారం ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఉదయం 6 గంటల నుంచి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. భక్తుల అధిక సంఖ్యలో పాల్గొనాలని పేర్కొన్నారు.