రంగారెడ్డి జిల్లాలోని జంట జలాశయాలకు భారీగా వర్ధనీరు వచ్చి చేరుతుంది ఈ సందర్భంగా శుక్రవారం తెలిసిన వివరాల ప్రకారం దీంతో ఉస్మాన్ సాగర్ నాలుగు గేట్లు హిమాయత్ సాగర్ మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువనకు వదిలారు .ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 ఫీట్లు కాగా ప్రస్తుతం 1785.50 ఫీట్లకు చేరుకుంది.హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 ఫీట్లు కాగా ప్రస్తుతం 1763.20 ఫీట్ల వద్ద ఉంది కాగా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు సూచించారు.