కుందూ నదిలో ఉయ్యాలవాడకు చెందిన ఫకూర్ బీ అనే వృద్ధురాలు ప్రమాదవశాత్తు జారి పడి గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి కుందూ నదిలోకి నీరు వచ్చి చేరుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి విడుదల చేసిన నీరు కూడా కుందూలోకి ప్రవహిస్తోంది.