పూర్తి వివరాల్లోకి వెళితే మృతుడు 30 సంవత్సరాల సురేష్ గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని రామిరెడ్డి తోటలో నివాసం ఉంటున్నాడు. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సుమారు 10 సంవత్సరాల క్రితం మీరా బీ అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే సురేష్ కు తన అన్న రమేష్ తో గత కొన్ని సంవత్సరాలుగా విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్న రమేష్ 22.08.2025 న పెట్రోల్ తీసుకుని వచ్చి తమ్ముడు సురేష్ మీద పోసి నిప్పు అంటించాడు. వెంటనే స్థానికులు సురేష్ భార్య మీరా బీ కి సమాచారం అందించి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేష్ మరణించాడు.