మలిదశ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ఉద్యమకారులు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా ఎన్నికల్లో మలిదశ ఉద్యమకారులకు 250 గజాలు ఇంటి స్థలం, 10 వేల రూపాయల ఆర్థిక సహాయం ఇస్తామని హామీ ఇచ్చిందని ఆ హామీలను నిలబెట్టుకోవాలని పోస్ట్ కార్డు ద్వారా రాహుల్ గాంధీకి విన్నవించుకుంటున్నట్లు మలిదశ ఉద్యమకారుల బాన్సువాడ మండల ప్రధాన కార్యదర్శి గంజి వార్ చందు వెల్లడించారు.