వైద్య ఖర్యులు ఊహించనంతగా పెరిగిపోతున్న నేపధ్యంలో ఉచిత వైద్య సేవలు అందించడం అందరి సామాజిక బాధ్యత అని ASF కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శనివారం రెబ్బెనలో ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. స్వచ్చంద సంస్థలు క్రీయాశీలకంగా ఉంటూ ప్రజల కష్టాలను ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. సుమారు 300 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహింయి, మందులు కంటి అద్దాలు, ఇచ్చారు. అవసరం అయిన వారికి త్వరలో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేపించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.