రంగారెడ్డి జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి హిమైత్ నగర్ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మూసి పరివాహక ప్రాంతాలు కెనాల్ చిన్నచిన్న బ్రిడ్జిల వద్ద కాలువలు మత్తడి దూకుతున్నాయి.. పరవాళ్ళు తొక్కుతున్న అలల సవ్వడలతో జలపాతాన్ని తలపిస్తున్నాయి .భారీగా వచ్చి చేరుతున్న వాన నీటితో కుంటలు చెరువులు జలకలను సంతరించుకుంటున్నాయి.