భూపాలపల్లి మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్న సునీల్ అతడి భార్య పట్టణంలోని బీసీ,ఎస్సీ హాస్టల్ ,మోడల్ స్కూల్ కి చెందిన విద్యార్థినిను శుక్రవారం రాత్రి ఇంటికి పిలిపించుకొని ఏసు ప్రార్థనలు చేస్తూ మతమార్పిడికి చేసేందుకు కుట్ర చేసినట్లుఅందులో విద్యార్థిని ద్వారా తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో తల్లిదండ్రులు,స్థానికులు టౌన్ ప్లానింగ్ అధికారిఇంటికిచేరుకొని ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు చేరుకొని వారికి నచ్చజెప్పి విద్యార్థులను తల్లిదండ్రులతో పంపించారు.ఈ సంఘటనపై ఎస్సై రమేష్ వివరణ కోరగా పూర్తి వివరాలు వెల్లడిస్తామని శనివారం ఉదయం 7 గంటలకు తెలిపారు.