భారీ వర్షాల నేపథ్యంలో వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని పరిగి డీఎస్పీ శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి నుండి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కావడం జరిగిందని, విద్యుత్ స్తంభాల వద్ద జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రతి వినాయక మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఫైర్, అలాగే విద్యుత్ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏమైనా అవాంఛనీయ సంఘటన జరిగితే 100 నెంబర్ కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.