పెంచికల్పేట్ మండలంలోని ఎల్కపల్లి గ్రామానికి చెందిన రైతు దూగుంట నారాయణపై అడవి పంది దాడి చేసింది. ఆదివారం తన పత్తి చేనులో పనులు చేస్తుండగా ఒకసారిగా అడవి పంది దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే గాయపడిన నారాయణను కాగజ్నగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పత్తి చేనులలో అడవిపందుల సంచారం ఎక్కువైందని అటవీ శాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు,