కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో సాయిబాబా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు తమపై న్యాయం చేయాలంటూ బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆటో స్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వలన తమకు బాడుగలు లేక తీవ్రంగా నష్టపోయామని అన్నారు. దీంతో నెలవారి ఆటో కిస్తీలు కట్టలేక పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు ఆర్థిక సహాయాన్ని అందించడంతోపాటు స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి ఇవ్వాలని పలువురు ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు.