ప్రకాశం జిల్లా మార్కాపురం క్లాత్ మర్చంట్ అసోసియేషన్ హాల్లో టైలర్ యూనియన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ గౌరవ అధ్యక్షులుగా కృష్ణారావు పట్టణ అధ్యక్షులుగా వడ్డేపల్లి రాము ప్రధాన కార్యదర్శిగా శ్రీను ఉపాధ్యక్షులుగా వలి సహాయ కార్యదర్శిగా మొహిద్దిన్ కోశాధికారిగా ధనుస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టైలర్స్ అభివృద్ధి కోసం నూతన కమిటీ పని చేస్తుందని కృష్ణారావు అన్నారు