నగరి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని వైసీపీ నాయకులు మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు అన్నదానం, రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. పేదల సంక్షేమం కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని నాయకులు కొనియాడారు.