గోదావరి నదికి మరల వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. ఇటీవల రెండుసార్లు వచ్చిన వరదతో లంక ప్రాంత ప్రజలు ముంపు వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద పెరుగుతూ ఉండటంతో మరోసారి లంక ప్రాంత ప్రజలలో ఆందోళన నెలకొంది. కపిలేశ్వరపురం మండలం అద్దంకి వారి లంక వద్ద ఆదివారం ఉదయం పొలం పనులకు వెళ్లే రైతులు పడవలపై ప్రయాణం చేస్తూ ఇబ్బందులు పడుతూ వెళ్లారు.