ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో జరిగిన ఘటనలో 6 మంది మృతి చెందడం బాధాకరమైన విషయమని, జై భీమ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానయ్య శుక్రవారం తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం 30 లక్షలు పరిహారం ఇవ్వాలన్నారు. పాఠశాలకు సమీపంలో ఉన్న ఆ గుంటను తవ్వాల్సిన అవసరం ఏముందని అన్నారు. గుంట తవ్వడానికి అనుమతి ఇచ్చిన ఎంపీడీవో, పంచాయతీ అధికారులు వీఆర్వో పై తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు.