ప్రమాదవశాత్తు వాగులో పడి తల్లితోపాటు ముగ్గురు చిన్నారులు మృతి చెందిన సంఘటన వాంకిడి మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి మండలంలోని దాబా గ్రామానికి చెందిన భుజిబాయి (35) చికిలి వాగులో యూరియా బస్తాలు కడగడానికి ముగ్గురు పిల్లలతో వెళ్ళింది. దీంతో ఆమె చిన్న కూతురు వాగులో కొట్టుకో పొగ ఆమెను కాపాడటానికి తల్లి వెళ్ళింది.. దీంతో మరో చిన్నారులు కూడా వాగులో గల్లంతయ్యారు. తల్లితో పాటు ముగ్గురు చిన్నారులు మృతి చెందారు.