శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం నగరంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మండల స్థాయి అండర్ -14, అండర్- 17 స్కూల్ గేమ్స్ పోటీలు నేటితో ముగిసాయి. మండలంలోని 16 పాఠశాలల నుంచి 190 విద్యార్థులు పాల్గొనగా, కేవలం 77 విద్యార్థులు డివిజన స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మండల స్థాయిలో అర్హత సాధించిన విద్యార్థులు ఈనెల 15 నుండి 17వ ఏది వరకు పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగే పోటీల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో వజ్ర కొత్తూరు మండల ఎంఈఓ బి వెంకటరమణ స్థానిక ప్రధానోపాధ్యాయుడి రామారావు తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.