వినాయక చవితి సందర్భంగా గత రెండు రోజులుగా రైల్వే కోడూరు ప్రధాన రహదారి వెంట చిరు వ్యాపారులు జోరుగా వ్యాపారం చేశారు. బుధవారం మధ్యాహ్ననికి వ్యాపారం ముగించుకొని వ్యర్థాలను వదిలి వారు వెళ్ళిపోవడంతో ఎటు చూసినా చెత్త దర్శనమిస్తోంది. వినాయక చవితికి చెరుకులు, ఆకులు, అలములు, గడ్డి, పండ్లు, అరటి చెట్లు, మామిడాకు వ్యాపారం రోడ్ల పక్కన వెలుస్తాయి. వారు వదిలిన వ్యర్థాలను మరుసటి రోజు పంచాయతీ సిబ్బంది క్లీన్ చేస్తారు. పండగ రోజు మాత్రం చెత్తాచెదారం దర్శనమిస్తుంది.